జిల్లాలో తొలిసారిగా సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ.. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోలు బంక్ ను నడిపించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, త్వరలో ప్రారంభం కానున్నదని తెలిపారు.