సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దంత వైద్యురాలు డాక్టర్ శిల్ప విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు చేశారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ వనజా రెడ్డి, కోశాధికారి ప్రసాద్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి రెడ్డి పాల్గొన్నారు.