శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహణలో సంగారెడ్డికి చెందిన భక్తులు ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ సమీపంలో సరస్వతీ నదిలో పుష్కర స్నానాన్ని శనివారం ఆచరించారు. పుష్కర స్నానం గురించి భక్తులకు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వివరించారు. 250 మంది భక్తులు పుష్కర స్నానాన్ని చేశారు.