
పేలిన ఏసీ.. రిపేర్ చేస్తున్న మెకానిక్ మృతి (వీడియో)
ఢిల్లీలోని కృష్ణ నగర్ ప్రాంతంలో మంగళవారం విషాద ఘటన జరిగింది. మనోహర్ లాల్ అనే మెకానిక్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్లో పని చేస్తున్నారు. ఆయన ఏసీ రిపేర్ చేస్తుండగా, మరో వ్యక్తి స్కూటర్‌పై కూర్చుని వేచి చూస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఏసీ కంప్రెసర్ పేలింది. ఈ సంఘటనలో మెకానిక్ ప్రాణాలు కోల్పోయారు. స్కూటర్‌పై ఉన్న వ్యక్తికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.