తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 290 ప్రాథమిక పాఠశాలలకు బోధనోపకరణాల కిట్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఐఐటీ గాంధీనగర్ నుంచి తయారు చేసిన కిట్లు జిల్లాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన పాఠశాలలకు మాత్రమే కిట్లను అందించినట్లు తెలిపారు. విద్యార్థులకు వీటితో బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు