సంగారెడ్డి జిల్లా అర్చక పురోహిత సంక్షేమ సంఘం నాయకులు శనివారం అయోధ్య రామ జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించి సందడి చేశారు. స్థానికంగా బాల రాముడు ప్రాణ ప్రతిష్ట జరిగే ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ద్వాదశి పురస్కరించుకొని పురోహితులు అయోధ్య రాముడిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.