ఐక్య పోరాటాల ద్వారానే విద్యారంగాన్ని పరిరక్షించుకుందామని విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర సహా అధ్యక్షుడు వై అశోక్ కుమార్ అన్నారు. సంగారెడ్డిలోని ఉపాధ్యాయ భవన్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తుందని ఆరోపించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరారు.