వైకుంఠ ఏకాదశి వేడుకలు సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురంలో శుక్రవారం నిర్వహించారు. తెల్లవారుజామున గరుడ వాహనంపై శ్రీవారిని ఊరేగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. అనంతరం భక్తులు ఉత్తర ద్వారం దర్శనమిదుల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దేవాలయ ప్రధాన అర్చకుడు వరదా చార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపించారు.