సదాశివపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయినాథ్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు ఉచితంగా కంటి వైద్య పరీక్షలను చేశారు కార్యక్రమంలో గురు స్వాములు గొనె శంకర్, సుధాకర్ గౌడ్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.