

అల్లు అర్జున్ను అరెస్టు చేయాలని పిటిషన్
అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మరణించిందని.. దీనికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ ఆ రాత్రిపూట రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయనను అరెస్టు చేయడంతో పాటు మృతురాలి కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరారు.