క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల కోసం రూ. 375 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఇన్ని నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు.