సంగారెడ్డి లోని దాసాంజనేయ మందిరంలో శనివారం రాత్రి హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు గంటపాటు భక్తులు 11 సార్లు హనుమాన్ చాలీసాను చదివారు. అర్చకులు హనుమంతునికి వేదమంత్రాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేశారు. హనుమంతునికి మంగళహారతి, నైవేద్యాలను సమర్పించారు.