
WTC FINAL: సఫారీలు ఈసారైనా సాధించేరా?
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) నేటి నుంచి ప్రారంభమవ్వనుంది. ట్రోఫీపై రెండోసారి కన్నేసిన ఆస్ట్రేలియా ఓ వైపు.. తొలిసారి టైటిల్ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్న దక్షిణాఫ్రికా మరోవైపు. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడికి గురయ్యే బలహీనత ఉన్న దక్షిణాఫ్రికా.. ఐసీసీ ట్రోఫీల్లో చివరి వరకూ వచ్చి ఓటమిపాలవుతుంటుంది. ఈసారి కొద్దిగా అదృష్టం కలిసొచ్చి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరింది. ఆస్ట్రేలియాతో తలపడి సఫారీలు 'చోకర్స్' అనే ముద్రను చెరిపేసుకుంటారో లేదో చూడాలి.