భారత రాజ్యాంగ రక్షణ కోసం ఐక్యంగా పోరాటం చేద్దామని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్యం అన్నారు. బీమా కోరేగావ్ యుద్ధ వీరుల విజయోత్సవ దినం సందర్భంగా సంగారెడ్డిలోని అంబేడ్కర్ విగ్రహానికి గురువారం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ. అగ్రకుల ఆధిపత్యం, అణిచివేతపై భీమా కోరేగావ్ యుద్ధం చేశారన్నారు. జిల్లా కార్యదర్శి పి అశోక్, కేవీపీఎస్ జిల్లా ఆఫీస్ బేరర్స్ బి. ప్రవీణ్, దాసు పాల్గొన్నారు.