అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్ఐసీ సంగారెడ్డి శాఖ సిబ్బంది స్థానిక మహిళా ప్రాంగణంలోని శిశుగృహా చిన్న పిల్లల కోసం పాలపొడి డబ్బాలు, నిత్యావసర వస్తువులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా శాఖాధిపతి మారుతి రావు మాట్లాడుతూ.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంతమంచి సేవా కార్యక్రమాన్ని ఎల్ఐసీ సిబ్బంది చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు.