ఎస్టీయూ టీఎస్ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, కవి, కార్మిక నాయకుడు, కామ్రేడ్ మగ్దూం మొహియుద్దీన్ జయంతి వేడుకలను సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఎస్టియూ సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ సాబేర్ అలీ, శ్రీనివాస్ రాథోడ్ ల ఆధ్వర్యంలో మొహియుద్దీన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, వారి సేవలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు.