సంగారెడ్డి లోని బైపాస్ రహదారిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవాల అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాన్ని జరిపించారు. దేవాలయం కమిటీ చైర్మన్ కొక్కొండ శ్రీశైలం గురుస్వామి ఆధరంలో భజన కార్యక్రమం జరిగింది. అనంతరం పడి వెలిగించి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కోశాధికారి ప్రేమ్ సాగర్, గురుస్వామి వెంకన్న పాల్గొన్నారు.