సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో మహాశివరాత్రి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయం సమీపంలో ఉన్న శివలింగానికి అర్చకులు మహన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు ఓం నమఃశివాయ అంటూ పెద్ద ఎత్తున నామస్మరణ చేశారు. శివలింగానికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు.