సంగారెడ్డి: 14న జాతీయ లోక్ అదాలత్

82చూసినవారు
సంగారెడ్డి: 14న జాతీయ లోక్ అదాలత్
సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో ఈనెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాజీ చేయదగ్గ భార్యాభర్తల చిన్నచిన్న వివాదాలు, ఎక్సైజ్, బ్యాంకు కేసులు పరిష్కరించుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్