ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 10న జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటున్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.