హెచ్ఎండిఏ పరిధిలోని 675 చెరువుల మ్యాపులు సిద్ధం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ చెరువులు ఆక్రమణకు గురికాకుండా ఇరిగేషన్, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి పాల్గొన్నారు.