ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్ష కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.