పుష్యమాసం మొదటి శనివారం సందర్భంగా సంగారెడ్డి సట్టి హనుమాన్ మందిరంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు శివ శర్మ ఆధ్వర్యంలో హనుమంతునికి మన్యసూక్త సహిత అభిషేక కార్యక్రమాన్ని జరిపించారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చదివారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.