రథసప్తమి సందర్భంగా సంగారెడ్డిలోని శ్రీ వైకుంఠాపురంలో రథోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ రామానుజ దేవనాథజీయర్ స్వామి ప్రత్యేక పూజలు చేసి రథయాత్రను ప్రారంభించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. జై శ్రీమన్నారాయణ నామమస్మరణ చేస్తూ భక్తులు ముందుకు సాగారు.