సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి లోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు మంగళవారం నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ గడ్డం సరిత తులసీరామ్ ఆధ్వర్యంలో శివలింగానికి ఫలాభిషేకం, బస్మాభిషేకం, రుద్రాభిషేకం, జరిపించారు. అనంతరం ప్రత్యేక అలంకరణ కార్యక్రమాన్ని జరిపించారు. ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.