గ్రామపంచాయతీలో పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శులు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బిల్లులు ఇప్పించేలా చర్యలు తీసుకుంటానని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బలరాం, నాయకులు వెంకటరాజు, దినేష్, మల్లేష్ గౌడ్, రమేష్, మల్లికార్జున్ పాల్గొన్నారు.