ఆర్టీసీని ఉద్యోగులు లాభాల్లోకి తీసుకెళ్లాలని రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ అన్నారు. సంగారెడ్డి ఆర్టీసీ డిపోను మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోకి కూడా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిఎం ఉపేందర్, ట్రాఫిక్ మేనేజర్ సువర్ణ బాయ్ పాల్గొన్నారు.