సంగారెడ్డి: భక్తిశ్రద్ధలతో సంకష్టి చతుర్థి పూజలు

65చూసినవారు
సంగారెడ్డి: భక్తిశ్రద్ధలతో సంకష్టి చతుర్థి పూజలు
సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం రేంజింతల్ గ్రామ శివారులో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో శనివారం సంకష్ఠ చతుర్థి పూజలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు జరిపి సింధూర లేపనం గావించి అలంకరణ చేశారు. విశేష పూజలు జరిపి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. ఆది పూజితుడిని దర్శించుకునేందుకు వేకువజామునుండే భక్తులు బారులు తీరారు.

సంబంధిత పోస్ట్