
గురుమూర్తి కేసు: మరో సంచలనం
TG: హైదరాబాద్ మీర్పేట్లో భార్య వెంకటమాధవిని గురుమూర్తి ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించిన ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదని, మరో ముగ్గురితో కలిసి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో ఓ మహిళ కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. కాగా గురుమూర్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు హత్యకు సహకరించిన వారి వివరాలు తీసుకునే పనిలో ఉన్నారు.