ఫిబ్రవరి 15 సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రకటించాలని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ఇవ్వడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడతారని చెప్పారు. సేవాలాల్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు.