మహిళల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు లక్ష్యమని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి లో మహిళా పెట్రోల్ బంక్ ట్రయల్ రన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ బంక్ నడుస్తుందని చెప్పారు. మొత్తం 14 మంది మహిళా సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. డిఆర్డిఓ జ్యోతి, అదనపు డిఆర్డిఓ జంగారెడ్డి పాల్గొన్నారు.