చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ వన్, 32వ వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో కొలువైన శ్రీ వైష్ణవీ మాతకు శనివారం రాత్రి చతుష్య అష్టోపచార పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు నాయికోటి రామప్ప ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అలంకరణ గావించి పూజలను జరిపారు. నైవేద్య నివేదన చేసిన అర్చక స్వాములు కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు.