ధనుర్మాసం సందర్భంగా ఈనెల 6వ తేదీన శ్రీవారి రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ వైకుంఠపురం దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు తెలిపారు. సంగారెడ్డి లోని దేవాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయం 11 గంటలకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి ఆలయం వరకు రథయాత్ర జరుగుతుందని చెప్పారు. 10వ తేదీన వైకుంఠ ఏకాదశి, 13న గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు.