ఏపీలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు
ఏపీలో రాబోయే నాలుగు రోజుల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతం పై సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం నేడు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఈ క్రమంలో దక్షిణ కోస్తా, రాయలసీమలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడి వర్షం పడనుందని అధికారులు తెలిపారు.