విద్యార్థులకు పాఠశాలలు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా నోడల్ అధికారి లింభాజీ అన్నారు. సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలో ఉపాధ్యాయులు, హెల్పర్లకు శిక్షణ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వంట ప్రదేశంలో శుభ్రత పాటించాలని చెప్పారు. నాణ్యమైన కూరగాయలు, వంటవస్తులు వాడాలని పేర్కొన్నారు. సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.