పదో తరగతి సప్లమెంటరీ స్పాట్ వాల్యుయేషన్ ఈనెల 14వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రకటనలో తెలిపారు సంగారెడ్డి పట్టణం శాంతినగర్ లోని సెయింట్ ఆంటోనీ పాఠశాలలో స్పాట్ వాల్యుయేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో పాల్గొనే ఉపాధ్యాయులు 13వ తేదీన రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.