సాంఘిక శాస్త్రం ఫోరం, వాసవి మా ఇల్లు సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సంగారెడ్డి లోని అంబేద్కర్ భవనంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష శనివారం నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు జరిగిన పరీక్షకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 192 మంది విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్, ఫోరం జిల్లా అధ్యక్షురాలు సునీత కన్నా పాల్గొన్నారు.