పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పాఠ్యంశంపై ప్రతిభ పోటీలు ఉపయోగపడతాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. వాసవి మా ఇల్లు, సోషల్ ఫోరం ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ లో శనివారం విజేతలకు బహుమతుల కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు పరీక్షల సులభంగా రాసే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్ పాల్గొన్నారు.