బైక్ పై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హోప్ న్యూరో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కృష్ణమూర్తి అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో పనిచేసే 220 మంది కార్మికులకు బుధవారం హెల్మెట్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ నిత్యం వీధుల్లో ఉండే కార్మికులకు హెల్మెట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈ ఇంతియాజ్ అహ్మద్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు.