సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో 5న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. సంగారెడ్డిలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సేకరించిన రక్తాన్ని తలసేమియా బాధితులకు అందిస్తామని పేర్కొన్నారు. ఉచిత దంత, నేత్ర శిబిరాలను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.