ఉపాధ్యాయుల బదిలీలో పదోన్నతులు వెంటనే చేపట్టాలని టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి లోని సంఘ భవనంలో శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. పాఠశాలలు తనిఖీ చేసేందుకు పర్యవేక్షణ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి రామచందర్ పాల్గొన్నారు.