సమగ్ర శిక్షా ఉద్యోగులకు ప్రభుత్వం వ్ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు వీరి సమ్మెకు ఆదివారం సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. 20 ఏళ్లుగా సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తూ వచ్చిన ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగులు 30 రోజులుగా పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు.