పుష్యమాసం శనివారం సందర్భంగా సంగారెడ్డిలోని శ్రీ నవరత్నాలయ దేవస్థానంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో జనప్రియ రాజు గురు స్వామి సన్నిధానం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. అయ్యప్ప స్వామికి ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలను వేదమంత్రాలతో జరిపించారు. గురుస్వాములు జయప్రకాశ్, సత్యనారాయణ, పరమేశ్వర్ గౌడ్, సునీల్ పాల్గొన్నారు.