సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురం దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి మూర్తికి దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు చేశారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.