మండలంలోని మాలపాడు గ్రామంలోని శ్రీ వీర హనుమాన్ మందిరంలో బుధవారం వైభవంగా జరిగిన శ్రీ ఆంజనేయస్వామి శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ. ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మిక చింతన ప్రతి మనిషికి ఎంతో అవసరం అని, ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవశ్యకత ఎంతో ఉందని అన్నారు.