ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ మాధురి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో ధాన్యం కొనుగోలుపై అవగాహన సమావేశం బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు సూచించిన రైస్ మిల్లు కు మాత్రమే పంపాలని చెప్పారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.