సంగారెడ్డి మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ప్రసాద్ చౌహన్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఎవరైనా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ఫ్లెక్సీలో ఏర్పాటు కోసం ముందుగా మున్సిపల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.