ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని హైదరాబాద్ ఆర్జెడి విజయలక్ష్మి అన్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డిఆర్పి శిక్షణను బుధవారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో విద్యార్థుల సంఖ్య పెంచేలా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎఎంవో బాలయ్య, సీఎంఓ వెంకటేశం, ఎంఈఓ విద్యాసాగర్ పాల్గొన్నారు.