విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య అన్నారు. చౌటకూరు మండలం సుల్తాన్పూర్ పరిధిలోని జేఎన్టీయూలో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సైబర్ క్రైమ్ ఫై కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జోగిపేట సిఐ అనిల్ కుమార్, ఎస్సై క్రాంతి కుమార్, ప్రిన్సిపాల్ నర్సమ్మ, వైస్ ప్రిన్సిపాల్ రాఘవేంద్రరావు పాల్గొన్నారు.