బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం

65చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని గంజి మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి చీపుర్లు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్